

ఇందు జ్ఞాన వేదిక ప్రబోధా సేవ సమితి ఎల్కతుర్తి శాఖ ఆధ్వర్యంలో.
ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి.
జనం న్యూస్ 4 ఆగస్టు 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్).
ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ గ్రామం శ్రీ పశుపతినాథ్ దేవాలయంలో ఇందు జ్ఞాన వేదిక ప్రబోధా సేవా సమితి ఎల్కతుర్తి శాఖ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు విశ్వావసు నామ సంవత్సరం శ్రావణమాసం తేదీ 16–08–2025 శనివారం నుండి తేదీ 17–08–2025 ఆదివారం వరకు నిర్వహిస్తున్నామని ఎల్కతుర్తి శాఖ అధ్యక్షులు ఆలయ అర్చకులు శ్రీ సదా నిరంజన్ సిద్ధాంతి తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి కరపత్రములను ఆలయ కమిటీ చైర్మన్ గంజి భావనఋషి చేతుల మీదుగా ఆవిష్కరించి సభ్యులకు, గ్రామ ప్రజలకు, భక్తులకు, కరపత్రాలు అందజేశామని దేవదేవుడైన జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి వేడుకలు ఊరు ఎరిగింపు పల్లకి సేవ కార్యక్రమాలు పూర్వకాలంలో 11 రోజులు వేడుకలుగా ఉండేవని కాలక్రమమైన తగ్గిపోయాయని శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు మళ్లీ పూర్వ వైభవం తెలియజేసి జన్మాష్టమి వేడుకలను 11 రోజులు చేసే విధంగా దైవ విధానాన్ని తెలియజేశారని, ఆధ్యాత్మిక గ్రంథాలు త్రైత సిద్ధాంత భగవద్గీత అనుబంధ 101 గ్రంథాలు రచించి అందించారని ఎంతో విలువైన దైవ జ్ఞానము ఆ గ్రంథాల్లో ఉంది అనే విషయం ప్రజలందరూ గమనించాలని ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో దైవభావంతో నిర్వహించడం జరుగుతుందని భక్తులందరూ స్వామివారి సేవా, పూజ కార్యక్రమంలో పాల్గొని దైవ జ్ఞాన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి, ఆలయ కమిటీ చైర్మన్ గంజి భావన ఋషి, సభ్యులు పోల్నేని రామారావు, పోలేని బాబురావు, కోడం రమేష్, దస్రు, విజయశ్రీ, జ్యోతి, సౌమ్య, స్వరూప, శ్యామల భక్తులు తదితరులు పాల్గొన్నారు.
