

స్తంభించిన బ్యాంకు కార్యకలాపాలు…
తీవ్ర ఇబ్బంది పడిన పెన్షన్ దారులు
పోలీసుల రంగ ప్రవేశం ధర్నాను శాంతింప చేసే యత్నం
జనం న్యూస్- ఆగస్టు 4 -నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ హిల్ కాలనీ లో గత 45 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కెనరా బ్యాంక్ విజయపురి నార్త్ శాఖ ను హాలియా కు తరలించొద్దని అన్ని పార్టీలు కలిపి సంయుక్తంగా సోమవారం ధర్నా చేపట్టారు. ఖాతాదారులు బ్యాంకు లోపలికి వెళ్లకుండా నిరసన కారులు గేట్లకు తాళం వేసి గేటు ముందు బైఠాయించి కూర్చున్నారు వీరితో పాటు ఖాతాదారులు కూడా తోడవడంతో ఆందోళన మరింత తీవ్రమైంది. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.వచ్చిన పోలీసులు ధర్న శాంతింప చేసే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది.వెంటనే స్థానిక ఎస్సై ముత్తయ్య హైదరాబాదు రీజనల్ మేనేజర్ కు ఫోన్ చేసి 100 కోట్ల టర్నోవర్ కలిగిన కెనరా బ్యాంకు, 15వేల ఖాతాలు, 2300 బంగారు రుణ ఖాతాలు, కలిగి ఉన్న బ్యాంకును ఎందుకు తరలిస్తున్నారని వివరణ కోరితే అక్కడ బ్యాంకుకు సెక్యూరిటీ లేదని అందుకు తరలిస్తున్నామని సమాధానం చెప్పారని అనడంతో 45 సంవత్సరాలుగా లేని దొంగలు ఇప్పుడెలా వస్తారని ఒకవేళ ఈ బ్యాంకును వేరేచోటకు తరలించినా అక్కడికి దొంగలు రారా అని ఖాతాదారులు కోపంతో ప్రశ్నించారు. 80 సంవత్సరాలలు పైబడిన వృద్ధ పెన్షన్ దారులైతే బ్యాంకు తరలించొద్దని కన్నీటి పర్యంతమయ్యారు బ్యాంకును తరలించమని హామీ ఇస్తే కానీ ధర్నా విరమించేది లేదని నిరసన చేస్తున్న అఖిలపక్ష నాయకులు భీష్మించుకుని కూర్చున్నారు. బ్యాంకు తరలింపు ఆగే వరకు ప్రతిరోజు ధర్నా చేస్తామని తమ అభిప్రాయాన్ని తెలిపారు.