

జనం న్యూస్- ఆగస్టు 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ కు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త న్యాయమూర్తికి ఏ.రాజశేఖర్ రెడ్డికి రెవెన్యూ ప్రోటోకాల్ ఆఫీసర్ దండా శ్రీనివాస్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సోమవారం నుండి రెండు రోజులు పాటు పలు కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన ఆయన స్థానిక విజయ విహార్ అతిధి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వీరితోపాటు స్థానిక సీఐ శ్రీను నాయక్, ఎస్ఐలు ముత్తయ్య,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.