

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండల కేంద్రంలో వున్న ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంకు కూతవేటు దూరంలో వున్న శ్రీ కామాక్షీ సమేత ఉల్లంగేశ్వర స్వామి అలయంను ఇలా నిర్మిస్తారు అని తెలిసి వుంటే అసలు ఇక్కడ చోళరాజులు,మట్టి రాజులు ఈ ఆలయమే నిర్మించే వారు కాదు ఎమొ.ఈ ఆలయంను ఎంత చక్కగా గతంలో రాజులు నిర్మించారు అంటే మాటల్లో వర్ణించలేం.వందల సంవత్సరాలు చెక్కు చెదరని ఆలయం చూస్తే ఈ ఆలయం అనాడు ఎంత వైభవంగా ఈ ఆలయంలో పరమేశ్వరుడు పూజలు అందుకున్నారో చెప్పవచ్చు.ఈయన భక్తులు కొరిన కోర్కెలు తీర్చే దేవుడు.ఈ ఆలయం ప్రముఖ పుణ్యం క్షేత్రం శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం ప్రక్కనే వుండటంతో శ్రీ సౌమ్యనాథుని దర్శించుకొనే భక్తులు ఉల్లంగేశ్వర స్వామిని దర్శించుకొనే వారు.ఈ ఆలయంలో మహా శివరాత్రి, కార్తిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగేవి.అటువంటి స్వామికి ఏదో నీడ కల్పిచం అన్నట్లు ఈ ఆలయంను కాంట్రాక్టర్ రాతి నిర్మాణంతో కాకుండా ఇటుకలతో ఎదో నిర్మిచం అంటే నిర్మించం అన్నట్లు వేశారు.ఒకప్పుడు గొప్ప రాతి శివాలయంను చూసిన నేడు ఇలా ఆలయ పనులు అర్ధంలో అపేసింది చూస్తుంటే కడుపు తరుక్క పోతుంది.గతంలో దేవదాయ శాఖ రు.50 లక్షలతో ఈ ఆలయం పనులు చేశాం అన్నారు,ఆ డబ్బుతో ఆలయ నిర్మాణం సగం వరకే సరిపోయాయి మిగాత నిర్మాణంకు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు MP రఘునాథ రెడ్డి ఆలయ నిర్మాణం కోసం ముందుకు వచ్చిన ఆలయ నిర్మాణం కొనసాగిన అది పూర్తి స్థాయిలో జరగలేదు.ఇప్పటికైన దేవాదాయ శాఖ అధికారులు ఈ ఆలయంను పూర్తి చేసి రాబోయే కార్తిక మాసంకు పూర్తి స్థాయిలో పూజలు భక్తుల సమక్షం జరిగేల చర్యలు చెపట్టాలని అడుఅడుగుతున్నాం,లేదంటే ఆ పరమశివుని భక్తుల ఆగ్రావేశాలకు గురికాక తప్పదు.
