

కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి,
జనం న్యూస్,ఆగస్ట్ 05,కంగ్టి
సంగారెడ్డి,జిల్లా కంగ్టి, సిర్గాపూర్,కల్హేర్, మండలాల యువతి యువకులకు మంగళవారం దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా సీఐ వెంకటరెడ్డి, మాట్లాడుతూ ఈ మధ్య యువత చిన్న పెద్ద తేడా లేకుండా మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళడం,మయ మాటలు చెప్పి వెంట తీసుకెళ్లడం చేస్తున్నారు.ఎవరైనా మైనర్ అమ్మాయి జోలికి వెళ్ళినా,తీసుకెళ్లినా, తీసుకెళ్లేందకు ఎవరైనా అతనికి సహకరించినా పోకసో చట్టంతో 14 సంవత్సరాల యావజ్జీవ శిక్ష విధించబడుతుందని అన్నారు.యువత పనికిరాని పనులు చేసి,తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువకులకు సూచించారు.గతంలో కొంత మంది ఇలా చేయడం వల్ల జైలుకు వెళ్లి వారి జీవితాలను నాశనం చేసుకున్నారని అన్నారు.తల్లి దండ్రులు, తమ పిల్లల పై అజమాయిషి,ఉంచాలి. వాళ్లు ఎలా ప్రవర్తిస్తున్నారో,ఏమి చేస్తున్నారో,ముఖ్యంగా ఫోన్స్ విషయంలో గానీ, ఛాటింగ్ విషయంలో గానీ,అబ్జర్వ్ చేస్తూ ఉండాలని అన్నారు. తమ పిల్లలను పట్టించుకోకపోవడం వల్ల పక్కదారి పట్టి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవడం జరుగుతుందని అన్నారు.