Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

కూకట్పల్లి నియోజకవర్గం లో నిన్న కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు మునిగిపోయాయి. ఫతేనగర్ డివిజన్ అమృత్ నగర్, తండా ,దీన్ దయాల్ నగర్, ప్రభాకర్ రెడ్డి నగర్, తదితర ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. మంగళవారం టి పి సి సి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.ముఖ్యంగా అమృత నగర్ తండా పూర్తిగా మునిగిపోయి స్థానికులు రోడ్డున పడ్డారు.ఆహార పదార్థాలు ఇతర వస్తువులు పనికిరాకుండా పోవడంతో నిన్న రాత్రి వాళ్ళు ఆహారం తినే పరిస్థితి లేకుండా పోయింది . కట్టుబట్టలతో రోడ్డును పడిన బస్తీ వాసులు అప్పటికి తాత్కాలికంగా హౌసింగ్ బోర్డ్ 15 పేస్ దగ్గరలో గల ఇందిరమ్మ గృహాల్లో తలదాచుకున్నారు. ఈరోజు ఉదయం వరద బాధితులకు మున్సిపల్ అధికారులు కెపిహెచ్బి కాలనీ నాలుగో ఫేస్ ఫంక్షన్ హాల్ లో పునరావాసం ఏర్పాట్లు చేశారు.
వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన బండి రమేష్ మాట్లాడుతూ
వరద బాధితులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు .కెపిహెచ్బి కాలనీ నాలుగో ఫేస్ లోని ఫంక్షన్ హాల్ లో బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. బాధితులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని పరిస్థితులు కుదుటపడే వరకు ప్రభుత్వమే అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, లక్ష్మయ్య, కుక్కల రమేష్, బాకీ, శివ చౌదరి తదితరులు పాల్గొన్నారు.