Listen to this article

యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ

జనం న్యూస్,ఆగస్టు05, అచ్యుతాపురం:


బాబు షురూటీ మోసం గ్యారంటీ – గ్రామ రచ్చబండ కార్యక్రమం 4వ రోజు రాంబిల్లి మండలం మర్రిపాలెం,దిమిలి గ్రామాల్లో యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిచయం అవుతూ,గ్రామ కమిటీలను త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు మోసాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు తెలియజేయాలని,
ప్రతి కార్యకర్తను ధర్మశ్రీ ఆకాంక్షించారు.వైసీపీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాంబిల్లి ఎంపీపీ శిరీష శ్రీనుబాబు, రాంబిల్లి మండల పార్టీ అధ్యక్షులు కిషోర్, కోవిరి రామకృష్ణ, పార్టీ సీనియర్ నాయకులు నెట్టెం సత్యనారాయణ, గోకివాడ నీరుకుండ వెంకట సూర్యనారాయణ మాస్టర్ , బోద్ధపు అప్పన్నదొర, నగిరెడ్డి కృష్ణ, కేజీ పాలెం సర్పంచ్ హరి, ఎలమంచిలి మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ధూధి నరసింహమూర్తి , మండల యువత అధ్యక్షుడు వెంకీ ఆయా గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు, స్తానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.