Listen to this article

..ముకుంద నాగేశ్వర్, టీ-జేఏసీ చైర్మన్, వికారాబాద్ జిల్లా.

జనం న్యూస్ ఆగస్టు 05 వికారాబాద్ జిల్లా

బీసీలు ఓటు చైతన్యం, ప్రజాస్వామిక పోరాటాల ద్వారా రాజ్యాంగ బద్ద హక్కులను సాధించుకోవాలి. దేశవ్యాప్తంగా ఎటువంటి కులగణన జనగణన లేకుండా అప్పటి ప్రస్తుత కేంద్రప్రభుత్వం ఈ.డబ్ల్యూ.ఎస్ పేరుతో 6 శాతం లేని వర్గాలకు 10 శాతం విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించినట్లు, ఈ పార్లమెంట్ సమావేశాలలో ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 54 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. పార్లమెంట్ లో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ గారి మాటలైన “ఎంత జనాభాకు అంత వాటా” అన్న నినాదం శుభ పరిణామం కావున కాంగ్రెస్ పార్టీ విద్య, ఉద్యోగ, చట్టసభల్లో మరియు పార్టీ పదవుల్లో కూడా దేశవ్యాప్తంగా ఈ నిబంధనలు పాటించి అమలు చేయాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వాలు నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే మరియు కులగణన చారిత్రాత్మక ఘట్టాలు వీటిని క్రోడీకరించి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు బీసీల రిజర్వేషన్ కోసం ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రంపై నెట్టేసి చేతులు దులుపుపోకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన రిపోర్ట్ శాసనసభలో ప్రవేశ పెట్టిన సమయంలో పిసిసి అధ్యక్షుడి మాటతో పార్టీ పరంగా నైనా రిజర్వేషన్లు అమలు చేస్తాం అన్నట్లుగా రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి. తెలంగాణాలో బీసీల ఓట్లు లేకుండా ఒక ఎంపీటీసీ, జడ్పిటిసి, ఎమ్మెల్యే, ఎంపీ కూడా గెలవలేని ఒకటి రెండు సామాజిక వర్గాలు రాజకీయ పార్టీల ముసుగులో జనాభాకు మించి తమ వర్గాలకి చట్టసభల్లో ప్రాధాన్యం కల్పిస్తూ బీసీల హక్కులను హరిస్తున్నాయి. ఓటు చైతన్యంతో తమ ఓటు తామే వేసుకుంటే అన్ని జనరల్ స్థానాలు గెలిచే అవకాశం ఉన్న బీసీలు అల్పసంఖ్యక వర్గాలకు పార్టీల ముసుగులో బానిసత్వం చేస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా నియోజకవర్గాల్లో బీసీ ఎమ్మెల్యేలు లేని గెలవని పరిస్థితి ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని గాయం వంటిది. తెలంగాణ ఇంచార్జ్ ఏఐసిసి మెంబర్ మీనాక్షి నటరాజన్ గారి పాదయాత్ర ద్వారా సామాజిక న్యాయ సాధనలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మూడు జిల్లాల మీ పార్టీ అధ్యక్షులు ఒకే సామాజిక వర్గం కావున బీసీలకు పార్టీ పరంగా జిల్లా అధ్యక్ష పదవులను కేటాయిస్తారని, అదేవిధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పరిగి నియోజకవర్గ MLA స్థానం బీసీలకు కేటాయించలేదు, అదేవిధంగా 2009లో ఏర్పడిన చేవెళ్ల లోక్ సభ స్థానం 4 సార్లు ఎన్నికలు జరిగినా ఇప్పటివరకు కూడా బీసీలకు కేటాయించలేదు కావున రాబోవు శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో ఈ స్థానాలతో పాటు తెలంగాణలో ఇప్పటివరకు బీసీలకు కేటాయించని జనరల్ MLA, MP, జిల్లా పరిషద్ చైర్మన్, MLC స్థానాలన్నింటినీ కాంగ్రేస్ పార్టీ తరుపున బీసీలకు కేటాయిస్తారని ఆశిస్తున్నాము. ప్రస్తుత వికారాబాద్ జిల్లాలోని మూడు జనరల్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, MLC మరియు గతంలో మీ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయి ప్రస్తుతం ఇతర పార్టీ నుండి గెలిచిన చేవెళ్ల MP అందరూ ఒకే సామాజిక వర్గం కావున ప్రస్తుత ప్రభుత్వములో రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచ్, జిల్లా పరిషత్ చైర్మన్ అన్ని జనరల్ స్థానాలన్నింటిని మీ పార్టీ తరుపున బీసీలకు కేటాయించి దశాబ్దాలుగా బీసీలకు జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని కొంత వరకు భర్తీ చేయాలని కోరుతున్నాం. ప్రజాస్వామ్యాధికారానికి రాని జాతులు అంతరించి పోతాయి కావున బీసీలు సంఘటిత ఐక్య పోరాటాల ద్వారా ఓటు చైతన్యంతో అధికార సాధన దిశగా అడుగులు వేయాలని కోరుతున్నాం. ముకుంద నాగేశ్వర్, టీజేఏసీ చైర్మన్, వికారాబాద్ జిల్లా.