Listen to this article

జనం న్యూస్, జనవరి 27, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ):- తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ వర్గల్ మండల శాఖ ఆధ్వర్యంలో సమస్యల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మండలంలోని వర్గల్, గౌరారం, తునిఖి ఖల్సా,మీనాజీ పేట్,అంబర్ పేట్, శాఖారం, వేలూరు, నాచారం,అంతగిరి పల్లి, దండు పల్లి, బొర్ర గూడెం,మజీద్ పల్లి, నెంటూర్, తదితర పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు తిరుపతి రెడ్డి,రాజులు,జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్, మాట్లాడుతూ, సిపిఎస్ ను రద్దు చేయాలనీ ఒకవైపు చేస్తుంటే,, కేంద్ర ప్రభుత్వం యూపిఎస్ ను తీసుకరావడాన్ని ఖండిస్తూ, వెంటనే పాత పెన్షన్ ను పునరుద్దరించాలని డిమాండ్ చేసారు.
ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని,జూలై 2023 నుండి రావాల్సిన పి ఆర్ సి ని వెంటనే అమలు చేయాలని, పెండింగులో ఉన్న మెడికల్, జిపిఎఫ్, లోన్స్, పార్ట్ ఫైనల్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని,ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావాల్సిన ఐదు డిఏలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జల్లెల శ్రీనివాస్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పర్వతం నర్సయ్య, పిల్లి రాములు, నాయకులు సత్తయ్య, రాజ నర్సింహా,మల్లేశం కృష్ణ,నర్సింగ రావు,భాస్కర్, అశోక్, నాగస్వామి, అశోక్,యాదగిరి తదితరులు పాల్గొన్నారు