

జనం న్యూస్,ఆగస్టు06,అచ్యుతాపురం:
కూటమి ప్రభుత్వం పేదలకు వరమని భావించాలని స్థానిక శాసన సభ్యులు సుందరపు విజయకుమార్ అన్నారు.బుధవారం నాడు యలమంచిలి జడ్పీ గెస్ట్ హౌస్ లో గల ఎమ్మెల్యే ఛాంబర్లో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో ఐదుగురు బాధితులకు రూ.3 లక్షల 5వేలు రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.అనంతరం విజయకుమార్ మాట్లాడుతూ పేద ప్రజలు సమస్యలను జనవాణి కార్యక్రమంలో తెలిపిన వెంటనే సంబంధిత అధికారితో మాట్లాడి సమస్యలు తీరుస్తూ, నిరంతరం అందరి శ్రేయస్సుకోరేది కూటమి ప్రభుత్వం అన్నారు.ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్రా జనసేనపార్టీ సమన్వయ ప్రతినిధి సుందరపు సతీష్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.