

జనం న్యూస్,ఆగస్టు06,అచ్యుతాపురం:
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కే లోకనాథం, జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు, నక్కపల్లి మండల కార్యదర్శి ఎం రాజేష్ లను పోలీసులు నిన్నటి నుండి గృహ నిర్బంధాలు చేసి అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు బలవంతపు భూసేకరణ ప్రజాపాయ సేకరణ ఉపసంహరించుకోవాలని సీపీఎం అచ్యుతాపురం మండల కమిటీ డిమాండ్ చేస్తూ అచ్యుతాపురం నాలుగు రోడ్ల సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు కర్రీ అప్పారావు మాట్లాడుతూ ఇప్పటికే ఆ ప్రాంతంలో రసాయన పరిశ్రమ వల్ల తీవ్రమైన పర్యావరణ సమస్యలు ఏర్పడి ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఉపాధి అవకాశాలు కూడా లేవని, గతంలో భూమి తీసుకున్న చోట ఎలాంటి పునరావాస చర్యలు తీసుకోలేదని, నక్కపల్లి మండలం పెద్ద తినార్ల, సిహెచ్ఎల్ పురం ఉపమాక ,రాజయ్య పేట, నరసాపురం, ఎస్ రాయవరం మండలం గుడివాడ గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రజాభిప్రాయ సేకరణకు పూనుకోవడం అన్యాయమని, ప్రజల అభిప్రాయాలను కాదని ప్రజాప్రయోజనం పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు బలవంతు సేకరణ చేపట్టడం చట్టవిరుద్దమని, ఈఐఏ నివేదికలో ప్రజలు మోసగించడానికి అనేక అబద్దాలు పొందుపరిచారని ఆయా గ్రామాల ప్రజల వ్యతిరేకిస్తున్నందున బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ఉపసహరించుకొని అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్ రాము, మండల కమిటీ సభ్యులు కే సోమనాయుడు, తాతయ్య ,గోపి, రాజు, అప్పారావు, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు