

జనం న్యూస్ ఆగష్టు 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం ఎస్సై జక్కుల. పరమేశ్వర్ తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా ప్రగతి సింగారం గ్రామస్తుడు అయిన దూలం జయపాల్ తండ్రి సాంబయ్య వారి కిరాణం షాపులో ప్రభుత్వ నిషేధిత టోబాకో ప్యాకెట్లు గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నాడానే సమాచారం మేరకు వెంటనే ప్రగతి సింగారం గ్రామంలోని జై హనుమాన్ కిరాణం తనిఖీ చేయగా అక్కడ ప్రభుత్వ నిషేధిత టోబాకో ప్యాకెట్లు గుట్కా ప్యాకెట్లు లభించాయని వాటి విలువ 6513/-రూ,, ఉంటుందని అట్టి టోబాకో పాకెట్లను షాప్ యజమాని అయిన దూలం జయపాల్ ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ నిషేధిత అంబర్ గుట్కాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలియజేసారు. ఈ తనిఖీలో కానిస్టేబుల్స్ సతీష్ నవీన్ సిబ్బంది పాల్గొన్నారు….