

జనం న్యూస్ ఆగష్టు 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని గల శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తున్నందున శ్రీ మహాలక్ష్మి పంచలోహ ఉత్సవ విగ్రహ ప్రతిష్టపణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శాయంపేట గ్రామ పెద్దలు అడ్వకేట్ గట్ల విజయపాల్ రెడ్డి సరోజన దంపతుల, వారి కుమారులు జిన్నా ప్రతాప్ సేనా రెడ్డి దేవాలయంలో అమ్మవారి పూజల కొరకు తమిళనాడులోని కుంభకోణం నుండి రెండు ఫీట్ల ఎత్తున అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని తెప్పించినట్లు తెలిపారు. ఈ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వరలక్ష్మీ వ్రతం రోజున శుక్రవారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు . ఉదయం 11 గంటలకు ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి తెలిపారు. సాయంత్రమ ఏడు గంటలకు ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని భక్తులు మహిళలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు…..