Listen to this article
  • ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి
  • జనం న్యూస్ జనవరి 27 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ :- ,ఆట,పాటలతో విద్యార్థులపై ఒత్తిడి లేకుండా కనీసం సంవత్సరానికి ఒక గ్రేడ్ అయినా పెరిగే విధంగా పిల్లలను చైతన్య పరుస్తూ, ప్రోత్సహిస్తూ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం,హాజరు శాతం పెరిగే విధంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు మన బాధ్యతగా భావించి విద్యార్థులను మంచి పౌరులుగా తయారు చేయాల్సిన అవసరం అందరి మీద ఉందని కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో హైస్కూల్ వేదికగా పాటంశెట్టి సూర్యచంద్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి తరగతిలోనూ క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ లతో పాటు డీ గ్రేడ్ నుండి సీ గ్రేడ్ కి, సీ గ్రేడ్ నుండి బి గ్రేడ్ కి,బి గ్రేడ్ నుండి ఏ గ్రేడ్ కి, ఏ గ్రేడ్ నుండి ఏ ప్లస్ కి వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా ప్రోత్సాహక బహుమతి ఇవ్వడం జరుగుతుందని వీటితో పాటు ఒక రోజు కూడా బడి మానకుండా నూరు శాతం హాజరు సాధించిన విద్యార్థులందరికీ బహుమతి ప్రధానం చేయడం జరుగుతుందని సూర్యచంద్ర తెలిపారు*