

జనం న్యూస్ జనవరి 27మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామానికి సంబంధించినటువంటి లిఫ్ట్ గురించి. కౌడిపల్లి ఇరిగేషన్ డిఇ జగన్నాథం సార్ ని, కలవడం జరిగింది. త్వరలోనే లిఫ్ట్ పనులు ప్రారంభించాలని హామీ ఇచ్చారు గత కొన్ని ఏళ్లుగా ఎవరు పట్టించుకోకపోవడం వల్ల లిఫ్టు అసంపూర్తిగా ఉంది కాబట్టి గ్రామ ప్రజలు ముందుకు వచ్చి కౌడిపల్లి ఇరిగేషన్ కి సంబంధించిన డి ఈ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని హామీ ఇచ్చారు ఈ లిఫ్ట్ వల్ల సాగువంతమైన భూములకు నీరు అందుతుంది కాబట్టి లిఫ్ట్ గురించి ప్రత్యేక చొరవ చూపి అతి తొందరలో పనులు ప్రారంభించి ఎన్నో సాగు ఎకరాలకు నీరు అవసరము ఉంటుంది కాబట్టి ఎంతోమంది రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కార్యక్రమంలో శేషాద్రి మరియు తలారి నర్సింలు చింతల కింది విష్ణు ఎనగండ్ల దశరథ్ పాల్గొన్నారు