

జనం న్యూస్ ఆగస్టు 08:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామంలో శ్రావణమాసంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేకమైన వ్రతం ద్వారా కుటుంబానికి ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం కలుగుతాయని నిర్వహించేకున్నారు. దేవాలయాల్లో మహిళలు తెల్లవారుజామునే పూజా ఏర్పాట్లు చేసి, లక్ష్మీదేవిని అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్రతం సందర్భంగా సాంప్రదాయ రీతిలో హారతులు, కథలు, సంకల్పాలు చేపట్టారు. కుటుంబసభ్యుల కల్యాణం కోసం ప్రార్థనలు చేశారు.పూజా కార్యక్రమాలు అనంతరం స్నేహితులు, బంధువులకు తాంబూలాలు పంపిణీ చేసుకున్నారు.పూజలో భాగంగా భూమి, శక్తి, శాంతి, కీర్తి, ప్రేమ, ఐశ్వర్యం కలుగుతుంది అని పూజలు చేస్తారు.
