Listen to this article

జనం న్యూస్ 09 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

జిల్లా క్రీడాధికారి (DSDO )గా ఇటీవల నూతనంగా నియమితులైన కె. శ్రీధర్ ను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసారు. అనంతరం దయానంద్ మాట్లాడుతూ క్రీడాభివృద్ధిలో జిల్లాను ముందు స్థానంలో నిలిపి తమదైన ముద్ర వేయాలని కోరారు. ఇటీవల నిర్వహించిన పారా జూనియర్, సబ్ జూనియర్స్ జిల్లా స్థాయి పోటీలకు సంభందించిన వివరాలను ఆయనకు తెలియజేసారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే అత్యధికంగా పారా క్రీడాకారులు ఉమ్మడి విజయనగరం జిల్లా నుండి పాల్గొన్నారని అన్నారు. జిల్లాలో ప్రతిభ గల దివ్యాంగ క్రీడాకారులకు కొదవ లేదని, నిరుపేద కుటుంబాలకు చెందిన వీరికి ఆర్ధికంగా ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో గల పారా క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందేలా చూడాలని కోరారు.