

జనం న్యూస్,ఆగస్ట్ 09,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలో శనివారం స్థానిక హనుమాన్ మందిరంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్న అంటే ధైర్యం,తమ్ముడు అంటే ప్రేమ,అమ్మ గర్భాన్ని పంచుకుని, నాన్న చూపిన బాటలో నడుచుకొని,ఏల్లకాలం తోడు నీడగా నిలిచేది సోదరా,సోదరీమణుల బంధం అని అన్నారు. రక్తం పంచుకుని పుట్టి, చివరి అంకం వరకు ప్రేమ,ఆప్యాయతలు పంచుకునే ప్రేమ బంధం అని అన్నారు.ఇలాంటి బంధానికి,ప్రతీకగ నిలుస్తోంది రాఖీ పండుగ,నేను నీకు రాక్ష,,నీవు నాకు రాక్ష అంటూ,అన్నా, తమ్ముళ్లకు అక్కా చెల్లెలు కట్టేది రక్షాబంధన్ అని అన్నారు.శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడి చూపుడు వేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపతి తన పట్టు చీర కొంగు చింపి కృష్ణుడి చేతికి కట్టు కట్టిందట.అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా అండగా ఉంటానని ద్రౌపతికి హామీ ఇచ్చారని అన్నారు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడు దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కాపాడారని పురాణాలు చెబుతున్నాయి అని అన్నారు.శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళలోకానికి వెళ్లి ఉండిపోగా,విష్ణువుకు తీసుకువెళ్లడానికి వచ్చిన లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్షాబంధనాన్ని కట్టి, రక్షాబంధనాన్ని కట్టిన తనకు రక్షణ కల్పించమని లక్ష్మీదేవి బలిచక్రవర్తిని కోరుతుంది.బలి చక్రవర్తి సోదరుడిగా తనకు రక్షాబంధనాన్ని కట్టిన సోదరికి బహుమానంగా విష్ణుమూర్తిని పంపుతాడు.దీంతో లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది.అంతటి శక్తివంతమైన బంధనం కాబట్టి రక్షాబంధనానికి ఇంతటి చరిత్ర ఉంది అని అన్నారు. సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న నేటి రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.సోదర సోదరీమణుల మధ్య ఉండే అనుబంధానికి, ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ రాఖీ పండుగ కావడంతో మానవ సంబంధాల మెరుగుదలకు, విచక్షణకు,ఈ పండుగ దోహదం చేస్తుంది అని అన్నారు.రాఖీ పండుగను రక్తం పంచుకుని పుట్టిన సోదర సోదరీమణుల మధ్య జరుపుకోవాలని లేదు,ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు,సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు. ఆత్మీయుల మధ్య అనుబంధాలకు, ఐకమత్యానికి,పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో యువజన సంఘ నాయకులు ఆంజనేయులు, సత్యనారాయణ, నరేందర్,పండరి, శ్రీనివాస్,సంతోష్,రాజు, తదితరులు పాల్గొన్నారు.