

అర్బన్ ఎమ్మెల్యే…
జనంన్యూస్. 09. నిజామాబాదు. ప్రతినిధి.
నిజామాబాదు.రాఖి పండగ సందర్బంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖి వేడుకల్లో బిజెపి మహిళా నాయకురాళ్లు ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కు రాఖి కట్టి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ప్రపంచంలో ఏ దేశంలో లేని విదంగా కేవలం మన భారత దేశంలో సోదరాభావానికి ప్రతీకగా దేశం అంతట రాఖి పండుగ జరుపుకోవడం మన సోదర భావానికి నిదర్శం అన్నారు.ఇది అనాది కాలంగా వస్తుందని భారతదేశానికి ఒక గొప్ప చరిత్ర సంస్కృతి, సాంప్రదాయలు కలిగి ఉందని భారతీయులంతా నా సోదరిమనులంటు పరాయి స్త్రీ ని కూడా అక్కగా, చెల్లిగా చూసే గొప్ప సంస్కృతి మన దేశంలోనే ఉందని అన్నారు.అలాంటి సంస్కృతిని, సోదరాభావన్నీ పెంపొందించే పండుగే రాఖి అని ఈ రాఖి అనేది అన్న -చెల్లికి, అక్క – తమ్మునికి రక్షాగా ఉంటు మనమంతా ఈ దేశానికి భరతమాతకు రక్షా ఉండాలని సూచించారు.చిన్నప్పటి నుండే పిల్లలో సోదరాభావన్నీ, దేశ భక్తిని నింపే ఇలాంటి సాంప్రదాయ పండుగల ప్రాముఖ్యతను భావి తరాలకు తెలియజేయాలనీ అన్నారు.ఈ కార్యక్రమంలో పంచరెడ్డి ప్రవళిక, మమతా, ఇందిరా, సుమిత్ర, హేమలత, వనిత, జ్యోతి, వరలక్ష్మి న్యాలం రాజు, నాగొల్ల లక్ష్మీనారాయణ, మాస్టర్ శంకర్, నారాయణ యాదవ్, మండల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
