

జనం న్యూస్ ఆగస్టు 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ కు మంచి ప్రభుత్వంగా భావించిన పారిశ్రామికవేత్తలు ఒక్కొక్కరు వరుసగా 9 లక్షల 68 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని, రాయలసీమకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, విశాఖపట్నంకి ఐటీ ఫార్మసీ అమరావతిలో హెచ్ సి ఎల్, ఇన్ఫోసిస్ కంపెనీలు, విద్యాసంస్థలు, క్వాంటం వ్యాలీ, రాజధాని నిర్మాణ పనులు శరవేగంతో ముందుకు పోతుందని, దేశంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ మహానగరం మొదటి స్థానంలో ఉందని మాజీ శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు ఈరోజు ఉదయం పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగా ఇది సాధ్యపడిందని అన్నారు. ఇటీవలే లింగ్డన్ సిటీ ఆఫ్ రైజ్ అనే సంస్థ సర్వేలో విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మొదటి స్థానం సాధించిందని రెండో స్థానం రాంచి మూడో స్థానం విజయవాడ వచ్చిందని వారి నివేదికలో తేటతెల్లం అయిందని నాగ జగదీష్ అన్నారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న టాప్ టెన్ ప్రధాన నగరాల్లో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం మొదటి స్థానం విజయవాడ మూడో స్థానం సంపాదించడంలో కీలక పాత్ర పోషించి కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పురోగతి దిశగా పయనం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్డీఏ సహకారంతో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందని నాగ జగదీష్ అన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆర్థిక ఐటీ హబ్ చేస్తామని చెప్పిందానికి అనుగుణంగా బాటలు పడుతున్నాయని ఐటీ రంగంలో టిసిఎస్, కాగ్నిజెంట్, 1,75,000 ఎన్టిపిసి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, ఒక్క లక్ష 65 వేల కోట్లతో నక్కపల్లి వద్ద అర్సలర్ మిటల్ స్టీల్ ప్లాంట్, ఫార్మా రంగంలో 6000 కోట్లతో లారెన్స్ కంపెనీ విశాఖ జిల్లాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని, ఇవి అన్ని రెండు సంవత్సరాల్లో పూర్తి అయిన తర్వాత 5 లక్షల ఉద్యోగాలు యువతి యువకులకు వచ్చి తీరుతాయని, ప్రభుత్వం కంకణం కట్టుకుంటే, మరోపక్క విధ్వంసకరుడు, ప్రజాధనాన్ని గజనీకంటే ఘోరంగా దోచుకున్న జగన్ రెడ్డి కి ఒక్కసారి ఓటు వేసినందుకు ప్రజాధనాన్ని లూటీ చేసింది కాకుండా, సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన పారిశ్రామిక వేత్తలపై గతంలో కేసులు పెడతామని బెదిరించి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టకుండా తరిమివేశారని, నాడు జగన్ రెడ్డి నాశనం చేసిన దాన్ని సరి చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తల ప్రాణం తోక వస్తుందని అన్ని అష్టకష్టాలు పడి వారిని ఒప్పించి అమరావతిలో 45 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుంటే, వారికి వైసీపీ మూకలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెడితే నష్టపోతారని ఈ మెయిల్స్ ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని, ఇటువంటి అభివృద్ధి నిరోధకులు, దోపిడీదారులు ఈ రాష్ట్రానికి అవసరమా అని నాగ జగదీష్ ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో బోడి వెంకటరావు కోట్ని రామకృష్ణ కుప్పిలి జగన్ మల్లా శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.