Listen to this article

జనం న్యూస్ ఆగష్టు 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని గోవిందా పురం గ్రామ శివారులో గల కస్తూరిబా బాలికల హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు శుక్రవారం రోజున కస్తూరిబా బాలికల హాస్టల్ ను ఆకస్మికంగా ఎమ్మెల్యే జీఎస్సార్ సందర్శించి హాస్టల్లోని భోజన వసతి విద్యా బోధన అంశాలపై ప్రతి తరగతి గదులు కిచెన్ రూమ్ డైనింగ్ రూమ్ తనిఖీ చేశారు విద్యార్థులను టీచర్లను హాస్టల్లోని ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు దీంతో హాస్టల్లో కోతుల బెడద దోమల నివారణ తరగతి గదుల్లో ఫ్యాన్లు లేకపోవడం లాంటి సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని తెలిపారు విద్యార్థులకు మెస్ చార్జీలు కాస్మోటిక్ చార్జీలు పెంచామని అన్నారు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విద్యార్థులను పట్టించుకోలేదు అన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాలు కూడా చేయలేదని విమర్శించారు పాఠశాలల్లో కొరతలు ఉన్న వసతులు మౌలిక సదుపాలపై స్పందించిన ఆయన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అలాగే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా టీచర్లు ప్రోత్సహించాలని సూచించారు భవిష్యత్తులో ఇలాంటి పాఠశాలల పరిరక్షణపై మరింత శ్రద్ధ తీసుకుంటామని హామీ ఇచ్చారు కోతులు రాకుండా సోలార్ ఫెన్సింగ్ దోమలు రాకుండా తరగతి గదులకు జాలీలు విద్యార్థులకు బెడ్లు సకాలంలో అందేలా చూస్తామని తెలిపారు అనంతరం విద్యార్థులు ఎమ్మెల్యే కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి చిందం రవి చల్ల చక్రపాణి దుబాసి కృష్ణమూర్తి కట్టయ్య టీచర్లు తదితరులు పాల్గొన్నారు….