

జనం న్యూస్ 11 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం రైల్వే స్టేషన్లో గంజాయితో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు GRP SI బాలాజీరావు తెలిపారు.
ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం శనివారం విజయనగరం రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించామని SI చెప్పారు. ఈ క్రమంలోనే 14 కేజీల గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని పట్టుకున్నామన్నారు.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈ ముగ్గురూ బరంపూర్ నుంచి చెన్నైకు గంజాయి తరలిస్తున్నారని వెల్లడించారు.