Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేని కొన రాత్రివేళ ఇంటిలో నిద్రిస్తున్న వివాహితపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేయడం పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి ముమ్మిడివరం జె ఎఫ్ సి ఎం కోర్టుకు రిమాండ్ కు పంపగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించారని కాట్రేనికోన ఎస్సై అవినాష్ తెలిపారు. రెండు రోజుల క్రితం చెయ్యేరులోనీ బ్రాహ్మణ చెరువులో ఇంట్లో నిద్రిస్తున్న మహిళలపై దార్ల అన్నవరం@ చిన వీర వెంకట సత్యనారాయణ అనే వ్యక్తి, పిల్లలతో కలిసి నిద్రిస్తున్న వివాహితపై అత్యాచారయత్నం చేశారు. బాధిక మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం ముద్దాయినీ అరెస్టు చేసి గౌరవ ముమ్మిడివరం జె.ఎఫ్ సి ఎం కోర్టులో గౌరవ న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టగా నిందితునికి 15 రోజులు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించామని ఎస్సై అవినాష్ తెలిపారు.