Listen to this article

ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలి.

ఎస్ఐ దుర్గారెడ్డి,

జనం న్యూస్,ఆగస్ట్ 12, కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని గ్రామలలోఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు ఉండదని ఎస్ఐ దుర్గారెడ్డి,స్పష్టం చేశారు.మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాట్లాడుతూ. మండల పరిధిలో అక్రమ వ్యాపారాలు, గుడుంబా తయారీ, ఇసుక అక్రమ రవాణా, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం అందించాలని అన్నారు.కంగ్టి మండలంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.ముఖ్యంగా వైన్‌ షాపుల సమీపంలో రోడ్లపైన బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని ఎస్ఐ మండల ప్రజలకు సూచించారు.