Listen to this article

జనం న్యూస్, ఆగస్టు12, అచ్యుతాపురం:

చినపూడి గ్రామంలో భూములు సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు స్థానిక పరిశ్రమలో పనులు కల్పించాలని ఈరోజు ఏపీఐఐసీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి జోనల్ మేనేజర్ నర్సింగరావుకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నిర్వాసితుల సంఘం నాయకులు ఆర్ రాము,సీఐటీయూ కన్వీనర్ కే సోము నాయుడు మాట్లాడుతూ చినపూడి గ్రామంలో నిర్వాసితులు భూములు కోల్పోయి ఉన్నారని, వీరి భూముల్లో నేడు ఇతర ప్రాంతాల నుండి వచ్చి భూములు కోల్పోయిన నిర్వాసితులకు పనులు ఇవ్వకుండా బలవంతంగా పనులు చేయడం అన్యాయమని, గ్రామం చుట్టూ భూములు కోల్పోయి తీవ్ర వాయు కాలుష్యంతో రకరకాల రోగాలతో మంచినీరు, ఉపాధి లేక భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్యాకేజీలు ఇచ్చారు తప్ప నేటికీ ఇంటి స్థలాలు ఇవ్వకపోవడం అన్యాయమని, వీరి న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని, భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇప్పుడు జరుగుతున్న పనుల్లో తక్షణం పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాజాన సంజీవ్,మహేష్ ,రాహుల్, నిర్వాసితులు, మహిళలు పాల్గొన్నారు.