

జనం న్యూస్ ఆగష్టు 13 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
మునగాల మండలం పరిధిలోని అన్ని గ్రామాలలో డీ జే లు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి డీజే ఓనర్స్ అందరికి ఇకనుంచి మండలంలో వినాయక చవితి, దుర్గామాత నవరాత్రి, ఉత్సవాలు మరియు పండగలు,పెళ్లిళ్లు సమయాలలో ఎక్కడ కూడా డీజే సౌండ్లు పెట్టకుండా ఉండాలి అని,మరియు డీజే లు పెట్టడం వల్ల వచ్చేటటువంటి అనర్థాలను అందరికీ వివరించి చెప్పడం జరిగింది.ఇకనుంచి ఎవరైనా డీజేలు పెట్టి బైండోవర్ ను ఉల్లంఘన చేస్తే వారు గవర్నమెంట్ కి ఐదు లక్షలు డిపాజిట్ చేయవలసి ఉంటుంది,మరియు వారి పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి అని చెప్పి మొత్తం 12 మందిని మునగాల తహసిల్దార్ ముందు ఐదు లక్షల పోచికత్తుకు బైండోవర్ చేయనైనది.అన్ని పొలిటికల్ పార్టీల ముఖ్య నాయకులకు మరియు ప్రజాప్రతినిధులకు పోలీస్ వారి తరఫున ముఖ్య విన్నపం దయచేసి మీ మీ గ్రామాలలో డీ జే లు పెట్టకుండా వారికి చెప్పడంతో పాటు ఒకవేళ ఎక్కడైనా డీజేలు పెట్టినట్లయితే వారికి సపోర్టుగా రాకూడదని తెలియపరిచారు.
