

కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి,
జనం న్యూస్,ఆగస్ట్ 13,కంగ్టి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి సర్కిల్ ప్రజలకు సీఐ వెంకటరెడ్డి,ముఖ్య సూచన,రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సర్కిల్ పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో సంగారెడ్డి జిల్లాలో రాబోయే మూడు రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించినందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వంతెనల పైన,బ్రిడ్జిల పైన,వాగులు ప్రవహించే ప్రవాహంలోనుంచి తొందరపాటుతో దాటడానికి ప్రయత్నించ కూడదని అన్నారు. అత్యవసరానికి తప్ప ఇంటి బయటకి వెళ్ళవద్దని అన్నారు. పాడుబడ్డ,శిథిలావస్తకు చేరువైన ఇళ్లలో ఉండవద్దని అన్నారు. తడిగా ఉన్న కరెంట్ స్తంభాలను,కరెంటు తీగలను,ముట్టుకోవద్దని అన్నారు.అత్యవసర పరిస్థితులు ఏర్పడితే సంబంధిత అధికారికి, పోలీస్ వారికీ,డయల్ 100 నెంబర్ కి కాల్ చేయాలని అన్నారు.