Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 13 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ

స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఉప్పూడి లోని బేతాని ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన స్వతంత్ర సమరయోధుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రెండవ తరగతి చిన్నారులంతా స్వతంత్ర సమరయోధులు అయిన సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, గాంధీజీ , అంబేద్కర్ ,దుర్గాబాయి దేశ్ముఖ్, ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి, భరతమాత పలువురు సిఫాయిల వేషధారణలో డ్రెస్లు వేసుకుని ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ఈ నెల 15న బహుమతులు అందిస్తామని ప్రిన్సిపల్ సిస్టర్ ఎలిజబెత్ రాణి తెలిపారు కార్యక్రమంలో సిస్టర్ డేసిమాని ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.