

ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి
జనం న్యూస్, ఆగస్టు 13, (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
సిద్దిపేట జిల్లా గ్రామం ములుగు ములుగు గ్రామపంచాయతీ లో కొంతకాలం గా పని చేస్తున్నాడు, కొమ్ము యాదగిరికి రెండు నెలల నుంచి ఆరోగ్యం బాగాలేక, రెండు రోజుల క్రితమే పనిలో చేరాడు. తేదీ 11 రోజున ఇంటిదగ్గర కరెంటు పోల్ లైట్ ఫిట్ చేసి దిగుతుండగా వేసుకున్న నిచ్చన స్లిప్ ఐ సి సి రోడ్డు మీద పడి తలకు బలంగా గాయం అయింది, పడగానే ఆర్ వి ఎం హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది, అక్కడ డాక్టర్స్ కి ఏం తెలియక గాంధీకి పంపించడం జరిగింది. అక్కడ చికిత్స చేసి బ్రతకడు అని కన్ఫర్మ్ చేశారు డాక్టర్లు, యాదగిరి కుటుంబానికి అండగా ఉంటానని డి సి సి బి చైర్మన్ బట్టు అంజిరెడ్డి తెలిపారు.మండల కేంద్రమైన మలుగు గ్రామానికి చెందిన కొమ్ము యాదగిరి గత 20 సంవత్సరాలుగా ములుగు గ్రామపంచాయతీలో ఎలక్ట్రిషన్ పని చేసేవాడు ఆకస్మాత్తుగా సోమవారం విద్యుత్ స్తంభానికి కాల్ జారి కింద పడడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. జిపి కార్మికుడు కొమ్ము యాదగిరి, కుటుంబాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, పరామర్శించి అన్ని వెదలాగా ఆదుకుంటానని హామీ ఇచ్చి ఆర్థిక సహాయం పదివేల రూపాయలు అందజేశారు. అంజిరెడ్డి తో పాటు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మణ్, నరేందర్, కిష్టయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.

