

జనం న్యూస్ 13 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చెయ్యాలని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రైల్వే స్టేషన్ వద్ద పార్టీ నాయకులు, ప్రయాణికుల తో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అల్లంశెట్టి నాగభూషణం, రాయి పద్మావతి, తాట్రాజు పాల్గ్‌న్నారు.