Listen to this article

జనం న్యూస్ 14ఆగష్టు పెగడపల్లి ప్రతినిధి.

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రం లోజిల్లా కలెక్టర్ ఆదేశానుసారం రాబోయే మూడు రోజులలో కురువనున్న భారీ వర్షాల దృష్ట్యా మండల కేంద్రంలో పోలీస్ యంత్రాంగంతో రెవెన్యూ సిబ్బంది. పంచాయతీరాజ్ సిబ్బందితో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాస్ రెడ్డి, అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మండల పరిధిలో గల అడుపపల్లె నుండి శాలపల్లికి వెళ్లే దారిలో ఉన్న కల్వర్టు వెంగలైపేట్ నుండి శాలపల్లికి కి వెళ్లే దారిలో ఉన్న కల్వర్టు లింగాపూర్ లోని పెద్ద చెరువు రాజరాంపల్లి, నక్కపల్లి, గ్రామాలలో నీటి ఉదృతి తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందువలన తీసుకోవాల్సిన చర్యలను గురించి తగు సూచనలు చేశారు. ఈ సమావేశంలో తహసిల్దార్ బి రవీందర్, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.