Listen to this article

చెడు ఆలోచనలకు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకోవాలి

తహసీల్దార్ చంద్రశేఖర్

జనం న్యూస్ ఆగష్టు 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

నషా ముక్త్ భారత్ అభియాన్, మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణం కార్యక్రమంలో భాగంగా బుధవారం మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసిల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ…డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వామ్యం అవుతామని,దృఢమైన సమాజ నిర్మాణం లో భాగస్వామ్యం అవుతామని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించడం జరిగినది. మాదకద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దడంలో విద్యార్థులు, పౌరులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని తెలిపారు.యువత జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి కష్టపడి చదవాలని తల్లిదండ్రులు గురువుల మాటలు వింటూ వారి బాటలో పయనిస్తూ తమ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, ఆర్ ఐ రామారావు, ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీలత, ఫిజికల్ డైరెక్టర్ ఆజం బాబా, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.