

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 13 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
చిలకలూరిపేట భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాటి నుండి నేటి వరకు నిరంతరం పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూ 100 సంవత్సరాలుగా పూర్తి చేసుకుందని సీపీఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు అన్నారు. బుధవారం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఒంగోలులో నిర్వహించనున్న సీపీఐ రాష్ట్ర మహాసభల వాల్‌పోస్టర్లను పార్టీ నాయకులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలులో ఈ నెల 20నుంచి 24వ తేదీ వరకు సీపీఐ రాష్ట్ర 28వ మహాసభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ మహసభలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. శతజయంతి సందర్భంగా ఒంగోలులో జరిగే సీపీఐ రాష్ట్ర మహాసభలకు ఎంతో ప్రాముఖ్యతసంతరించుకుందన్నారు.పేదల పక్షాన నిలబడేది ఎర్ర జెండా పార్టీ మాత్రమే అని ఆయన కొనియాడారు. ప్రపంచంలో అత్యంత శ్రమజీవులు, కార్మికులు కలిగిన పెద్ద పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని ప్రపంచంలో ఏ దేశంలోనైనా కమ్యూనిస్టులు ఉంటున్నారని గుర్తు చేశారు.అన్ని వర్గాల కులాలకు, రాజకీయ పార్టీల అతీతంగా సమస్యలను పోరాటంలో ముందుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బెదిరింపులకు బెదరకుండా ధైర్యంగా సమస్యలను పరిష్కరించుకుంటూ పోతూ ప్రజల వద్ద ఒక మంచి గుర్తింపు పొందిన పార్టీ సీపీఐ అన్నారు.. విద్య, వైద్య, కూడు, గుడ్డ తదితర అవసరాలు గల పేద ప్రజలకు సమకూర్చటంలో సీపీఐ పార్టీ ఇప్పటికీ కూడా ఎనలేని కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశం సంక్షోభంలో ఉందన్నారు. దేశంలో ఒడిదొడుకులున్నా, యుద్ధాలు జరిగినా అన్నింటినీ తట్టుకొని నిలబడి అభివృద్ధి బాటలో పయనిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పారదర్శకత లోపించిందన్నారు. కార్యక్రమంలో పీపీఐ ఏరియా సహాయ కార్యదర్శి బొంతా ధనరాజ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాని, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు, వేలూరు గ్రామ కార్యదర్శి ఎలిక శ్రీనివాసరావు, బొంతా కోటేశ్వరరావు, సయ్యద్ నానా, షేక్ నన్నే,సౌటుపల్లి బాబు తదితరులు… పాల్గొన్నారు.