

జనం న్యూస్,ఆగస్టు13,అచ్యుతాపురం:
యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం ఎస్కేఆర్ ఫంక్షన్ హాల్లో టీడీపీ,జనసేన,బీజేపీ పార్టీల సమన్వయ సమావేశంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్,ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు,లాలం భవాని భాస్కర్ ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ మూడు పార్టీలు సమన్వయంతో కలిసి పని చేస్తే నియోజకవర్గ అభివృద్ధి వేగంగా జరుగుతుందని,ఎలమంచిలి నియోజకవర్గం ప్రజల కోసమే అభివృద్ధి లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త, క్యాడర్ విధిగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలు జనసేన,టీడీపీ,బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
