Listen to this article

జనం న్యూస్ 14 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

ర్యాగింగ్‌కు పాల్పడి భవిష్యత్‌ను పాడు చేసుకోవద్దని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్‌ సూచించారు. ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు.
ర్యాగింగ్‌ చేసినా, ప్రోత్సహించినా రెండేళ్ల జైలు శిక్ష రూ.10 వేల జరిమానా విధించబడుతుందన్నారు.
జూనియర్లు సీనియర్లు స్నేహపూర్వక వాతావరణంతో మెలగాలన్నారు.