Listen to this article

జనం న్యూస్,ఆగస్ట్15,జూలూరుపాడు:

79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా జూలూరుపాడు మండలంలోని సీనియర్స్ ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు సీనియర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొల్లిపాక చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారు అన్నవరపు జశ్వంత్ కుమార్ జాతీయ పతకాన్ని ఎగరవేసి అనంతరం భారత దేశ స్వాతంత్రం కోసం పోరాడిన, ప్రాణాలను అర్పించిన నాయకులకు జోహార్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు గుండా సత్యనారాయణ, చాపలమడుగు నరసింహారావు,బాపట్ల మురళి, దిలీప్ కుమార్,తాంబర్ల పుల్లారావు,సంఘం నాగరాజు,ఉసికల రమేష్,బుడెన్ పాషా, బారం రమేష్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో,పాఠశాలలో ఆయా అధికారులచే జాతీయ పతకాన్ని ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.