

మద్నూర్ ఆగస్టు 15 జనం న్యూస్
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని. శుక్రవారం రోజు మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ & jr కళాశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు .. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు.. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జాతీయ జెండా ఆవిష్కరించారు..అనంతరం వారు మాట్లాడుతూ..స్వాతంత్ర్య సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.. వారి ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు..విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకొని దేశ ప్రగతిలో పాలుపంచుకోవాలని చెప్పారు..ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువు, క్రమశిక్షణతో పాటు వారిలో దేశభక్తి భావాలు పెంపొందించే విధంగా కృషి చేయాలని, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు,ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం బస్వంత్, చెవులవర హనుమాన్లు, గంగాధర్ మైనార్టీ నాయకుడు కలీం మండల పార్టీ కార్యకర్తలు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
