Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 27 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్ల సంఘం నరసరావుపేటలోని ధర్నా సెంటర్ వద్ద నిరాహార దీక్షలు కొనసాగాయి ఈరోజు నుండి 29వ తారీకు వరకు నిరాహార దీక్షలో కొనసాగుతాయని జిల్లా వివో ఏ యానిమేటర్ల సంఘం అధ్యక్షురాలు ఎన్ ఏ సుమ్మ తెలియజేశారు మొదటి రోజు భాగంగా కొంతమంది సభ్యులతో కలిసి యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మరియు జిల్లా అధ్యక్షులు హనుమంత రెడ్డి మరికొందరు సభ్యులతో కలిసి నిరసన దీక్షలు ప్రారంభించారు ప్రభుత్వానికి వారి యొక్క డిమాండ్లను తెలియజేస్తూ బ్యానర్లు ప్రదర్శిస్తూనారు మొదటిగా ఆరు నెలల బకాయి వేతనాలు చెల్లించాలి కాలపరిమితి సర్కిలను రద్దు చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి పనివభారాన్ని తగ్గించాలి అక్రమ తొలగింపులు నిలిపివేయాలి రాజకీయ వేధింపులను అరికట్టాలి స్వావలంబన అమౌంట్ తిరిగి చెల్లించాలి అను నినాదాలతో సిఐటియు పల్నాడు జిల్లా వారి ఆధ్వర్యంలో ఈ నిరసన దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ కార్యక్రమానికి కే హనుమంత రెడ్డి సిఐటియు జిల్లా అధ్యక్షులు యానిమేడల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షురాలు ఎన్ ఏసుమ్మ యు శైలజ ఏ అనంతలక్ష్మి ఏ అచ్చయ్య హెచ్ హైమావతి లోకయ్య తేజ పేరాల సుజాత మహాలక్ష్మి పాటిబండ్ల ఉషారాణి బండి మాధవి బత్తుల సుధామణి చిలకా రమణా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు