

.జనం న్యూస్ ఆగష్టు 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని మత్తు పదార్థాలకు నిర్మూలన పై సీఐ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్ ప్రతిజ్ఞ చేయించారు అనంతరం సీఐ మాట్లాడుతూ మత్తు ద్రవ్యాల వల్ల కలిగే దుష్పప్రహాలను వివరించారు మాత్తుకు అలవాటు పడిన వ్యక్తి ఆరోగ్యం భవిష్యత్తు కుటుంబం సమాజంలో గౌరవం పోగొట్టుకొని జీవితం సర్వనాశనం అవుతుందని హెచ్చరించారు చౌరస్తా వద్దు ప్రజలతోని డ్రక్స్ రహిత జీవనశైలి పాటించడం చుట్టుపక్కల వారు మత్తు పదార్థాల పడకుండా చూడడం వాటి విక్రయం కొనుగోలు అక్రమ రవాణా వంటి కార్యక్రమాలపై వెంటనే అధికారులకు సమాచారం అందించాలని డ్రగ్స్ లేని సమాజం నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని ప్రతిజ్ఞ చేయించారు అదేవిధంగా మత్తు పదార్థాలకు బానిసలుగా మారితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది యువకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…..