Listen to this article

జనం న్యూస్ ఆగష్టు 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలోని జెడ్పీ హెచ్ ఎస్ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో 2024.25 సంవత్సరంలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దాతలు నగదు రూపాయలను అందజేసినారు మొదటి బహుమతిగా ప్రొఫెసర్ బాసని శంకరయ్య జ్ఞాపకార్థం 5000 రూపాయలు రంగు సంజయ్ కు బాసని సుబ్రహ్మణ్యం అందించారు ద్వితీయ బహుమతిగా దిడ్డి సాంబయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు ధిడ్డి రమేష్ 4000 రూపాయలు గొట్టిముక్కుల సాయి కృష్ణ కి అందించారు తృతీయ బహుమతిగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు సామల వీరేశం జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి సాదు వంశీ కి 3000 అందించారు అలాగే జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ప్రథమ బహుమతి నామని అక్షయకు కీర్తిశేషులు బాసని సుదర్శనం జ్ఞాపకార్థం వారి భార్య బాసని అరుణ తరపున 5000 రూపాయలను బాసని సుబ్రహ్మణ్యం అందజేశారు ద్వితీయ బహుమతిగా దిడ్డి సాంబయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు దిడ్డి రమేష్ 4000 సాయి శ్రీ కి అందజేశారు తృతీయ బహుమతిగా కీర్తిశేషురాలు సామల రాధమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి 3000 ఎండి అమ్రిన్ కి అందజేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు శ్రీనివాస్ శ్రీలత మాజీ సర్పంచ్ కందగట్ల రవి దిడ్డి ప్రభాకర్ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్లు దాసరి కల్పన కానుగుల కవిత ఉపాధ్యాయులు ఉపాధ్యాయినిలు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.