

బిచ్కుంద ఆగస్టు 15 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం బిచ్కుంద పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న వెంకట్రావు పటేల్ కు ఉత్తమ సేవ పథకం అవార్డు అందుకున్నారు. . కామారెడ్డిలో జరిగిన కార్య క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అతిథి కొదండరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర చేతుల మీదుగా వెంకట్రావు పటేల్ ఈ అవార్డును స్వీకరించారు. ఈ అవార్డు దక్కించుకున్నందుకు ఎస్ఐ మోహన్ రెడ్డి, సీఐ రవికుమార్ అభినందించారు.