Listen to this article

జనం న్యూస్ 16 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

శుక్రవారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డి పి టి ఓ కార్యాలయం మరియు ఆర్టీసీ గ్యారేజ్ ఆవరణంలో డి పి టి ఓ వరలక్ష్మి, డిపో మేనేజర్ శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుబావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. దేశానికి త్యాగమూర్తుల చేసిన సేవలు, త్యాగాలు మరువలేనివన్నారు. మహానీయుల త్యాగాలు దేశ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. స్త్రీ శక్తి’ పథకం మహిళలకు ఫ్రీ బస్సు పథకంలో ఎటువంటి ఫిర్యాదులు లేకున్నా మంచి పేరు తెస్తారని మరియు కండక్టర్లు డ్రైవర్లు ప్రయాణికులు పట్ల మర్యాదగా ప్రవర్తించి మన్నలను పొందవలెన తెలియజేశారు. ఉత్త‌మ సేవ‌ల‌ను అందించిన ఆర్టీసీ సిబ్బందికి ప్ర‌శంసా ప‌త్రాల‌ను అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.