

జనం న్యూస్ 16 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
దేశం కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసిన అమర వీరుల త్యాగాలను, వారి జీవితాలను ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని తద్వారా జాతి గర్వించదగ్గ గొప్ప స్థాయికి విద్యార్థులంతా చేరుకోవాలని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ అన్నారు. సారధి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం తోటపాలెం హాస్టల్ లో నిర్వహించిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు, అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారి బానిస సంకెళ్లు నుండి విడిపించేందుకు ఆనాడు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎంతోమంది దేశభక్తులు ప్రాణత్యాగం చేసారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు దేశమంతా స్వేచ్చా వాయువులను పీల్చుకుంటుందని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశం యొక్క గొప్పతనమని, దానిని చాటి చెప్పాల్సిన భాద్యత నేడు అందరిపైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు చారి, కోచ్ మహేష్, AITUC జిల్లా నాయకులు రంగరాజు, సారధి వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు జి. వెంకటరావు, పింకీ, అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.