

ఆధ్యాత్మిక కేంద్రంగా వెల్లీ విరిసిన జ్యోతి మహారాజ్ ఆశ్రమం
భక్తుల కోరికలు తీర్చే అభయ ఆంజనేయుడు
ఘనంగా శ్రావణ మాసం ఉత్సవాలు
జనం న్యూస్,ఆగస్ట్ 16,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ఎంపల్లి మహా పుణ్యక్షేత్రం భక్తుల కోరికలను నెరవేర్చే కల్పవల్లిగా పేరొందిన పుణ్యక్షేత్రం ఎంపల్లి హనుమాన్ ఆలయం అని ఆలయ ప్రధాన అర్చకులు రాందాస్ మహారాజ్,అన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఎంపల్లి ఆలయ ప్రాంగణంలో నిత్య పూజలతో భక్తుల సందడి నెలకొంది. ప్రత్యేక అభిషేక పూజలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. శ్రావణమాసం ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుండడంతో పాటు వైష్ణవ సాంప్రదాయిక్ అఖండ హరినామ స్మరణ భజనలు,సంకీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.శ్రీ లక్ష్మణ సమేత సీతారామాంజనేయ స్వామి ఆలయం,శ్రీ రుక్మిణి పాండురంగ ఆలయం,శ్రీ పార్వతీ పరమేశ్వరుని ఆలయం,శ్రీ త్రిమూర్తి దత్తాత్రేయ ఆలయం,నవగ్రహ ఆలయం,జ్యోతి మహారాజ్ దునితో పాటు పిరమిడ్ ధ్యాన కేంద్రం,ఇలా మందిరాల సముదాయంగా మారింది.ఎంపల్లి పరిసరం జ్యోతి మహారాజ్, 2014 లో అనారోగ్యంతో ఆలయ పరిసరాల్లోనే శివైక్యం పొందారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో మందిరంను నియమించి జ్యోతి మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్టించారు.ప్రతి సంవత్సరము శ్రావణమాస మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో శివదీక్ష దారులకు శివా ఆశ్రమంగా మారింది. గత నెల రోజుల నుంచి శివదీక్ష దారులతో నిత్యం అభిషేక పూజలు అందుకోవడంతో పాటు శివనామస్మరణ ఆకుంటితంగా కొనసాగుతుంది.వైష్ణవ సాంప్రదాయిక్ అఖండ హరినామ సప్తహమును నిర్వహిస్తూ ఉంటారు. మహాశివరాత్రి ఏకాదశి మరుసటి రోజున దేహు నివాసి శ్రీ సంత జగద్గురు తుకారాం మహారాజ్ పంచమ వేద గాథ పూజ,కాలా కీర్తన నిర్వహించనున్నట్లు భక్తులు తెలిపారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు,ఆంజనేయ స్వాములు,శివ స్వాములు,అయ్యప్ప స్వాములు,సన్నిధిగా మారి నిత్యం గుడి గంటల చప్పుళ్ళతో మారు మోగుతుంది. భక్తులతో సందడిగా మారింది.మండలంలోని జంమ్గి కే శివరకు తగిలి ఉన్న గ్రామంగా ఎంపల్లి ప్రసిద్ధి,అక్కడ గతంలో ఇళ్లు ఉండేవి.రెవిన్యూ గ్రామంగా పరిగణించబడింది.కానీ దాదాపు 60 ఏళ్ల క్రితం ఎంపల్లి గ్రామంలోని ప్రజలు అనారోగ్యంతో బాధపడుతుండడంతో పాటు ఒకరి నుంచి మరొకరికి అంటు వ్యాధులు సోకుతున్నాయనే ఆందోళనతో గ్రామం ఖాళీ చేసినట్లు సమాచారం.అప్పటికే అడవిలో దట్టమైన చెట్లలో వెలసిన హనుమాన్ విగ్రహం ఒకటి మహా మర్రి చెట్టు కింద భక్తుల పూజలను అందుకుంది.ఆలయం పరిసరాల్లో వెళ్లాలన్న ప్రజలు భయపడేంత గుట్టలు,చెట్లు,పొదలు,ఉండేవి.ఆపద మొక్కుల కోసం మొక్కుకున్న వారికి కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు విశ్వాసంగా ప్రత్యేక అభిషేక పూజలను నిర్వహిస్తున్నారు.ఇలా దినదినం భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో పాటు,ఆలయ అభివృద్ధి నిరంతరంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోని చిన్నగంజం మండలం కడపకూదూరు గ్రామానికి చెందిన రంగారావు,హనుమాన్ ఆలయ దర్శనార్థం వచ్చి ఇక్కడే జ్యోతి మహారాజ్ పేరుతో స్థిరపడ్డారు. 1993 వ సంవత్సరం నుంచి 2014 వ సంవత్సరం వరకు 21 ఏళ్లు ఆలయని అభివృద్ధి పరిచారు.శ్రీ హనుమాన్ మందిర్ పరిసరాల్లో శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయాన్ని,శ్రీ లక్ష్మణ సమేత సీతా రామాంజనేయ ఆలయాన్ని,త్రిమూర్తి దత్తాత్రేయుని ఆలయాన్ని,శ్రీ రుక్మిణి పాండురంగ ఆలయాలను పునరుద్ధరించారు. శనీ సోమవారాలలో నిత్య మహా అన్నదాన ప్రసాదము వితరణ నిర్వహించడం జరుగుతుందని అన్నారు.