Listen to this article

ఎస్ఐ కే శ్వేత

(జనం న్యూస్ 16ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి)

భీమారం మండలంలోని శనివారం రోజున నర్సింగాపూర్ రోడ్డు రొడ్డం వద్ద ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై నీటి ప్రవాహం ఎత్తిపోయడంతో వాహనాల రాకపోకలపై అంతరాయం ఏర్పడింది,అ సంఘటన స్థలానికి చేరుకున్న మండల స్థానిక ఎస్సై కే శ్వేత మరియు సిబ్బంది గ్రామపంచాయతీ ట్రాక్టర్లు రోడ్డుకు అడ్డగా నిలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పాత ఇండ్లలో ఉంటే జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్ స్తంభాల ను పట్టుకోకూడదు. కరెంటు షాక్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు. ఉధృత ప్రవాహం ఉన్న చోట్లకు . వాగులు, వంకల వద్దకు చేపల వేటకు జాలర్లు పశువులను కాయడానికి నదులు, వాగులు, చెరువుల దగ్గరకు తీసుకెళ్లకుండా జాగ్రత్త వహించాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు, సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలి. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండ ప్రాణాలు రక్షించుకోవాలని అన్నారు, మీ గ్రామాలలో వరద నీటి సమస్య ఉంటే  ఆశ వర్కర్ కు , గ్రామ కార్యదర్శికి మరియు సంబంధిత అధికారులకు చెప్పగలరు. సూచించారు