Listen to this article

జనం న్యూస్:16 ఆగస్టు శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జివై రమేష్ ;

సిద్దిపేటపట్టణం భరత్ నగర్‌లోని వివేకానంద విద్యాలయంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణ, గోపిక వేషధారణలో పాఠశాలకు విచ్చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, నాటికలు, పాటలు ప్రదర్శించి కృష్ణుడి జీవితం, తత్వాలను తెలియజేశారు.పాఠశాల ప్రాంగణం సంప్రదాయబద్ధంగా అలంకరించబడింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ యాల్ల భాస్కర్ రెడ్డి, కరస్పాండెంట్ లిఖిత, ఉపాధ్యాయినులు రత్నమాల, దేవిక, రేఖ, అష్షు, సమత, శ్రీలత, వాణిశ్రీ, మానుష తదితరులు పాల్గొన్నారు.