Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 16 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

రేపు 17వ తారీకు ఆదివారం నాడు చిలకలూరిపేట సుబ్బయ్యతోట దత్త సాయి సన్నిధి జయ జయ సాయి ట్రస్టు ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు అరుదైన రక్తనాళాలకు సంబంధించిన షుగర్ పుండ్లకు, రక్తనాళాల వాపు కు, రక్తనాళాలకు సంబంధించిన అనేక సమస్యలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని లీలావతి హాస్పిటల్స్ అధినేత డాక్టర్లావు సుష్మ, కోరారు, ఎక్కువకాలం నుంచి సుగర్ ఉన్నవాళ్లు బీపీ ఉన్నవాళ్లు మోకాళ్లలో రక్తనాళాలు వాపు ఉన్నవాళ్లు హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడే వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు, అనంతరం కాంపౌండర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండముట్ల నాగేశ్వరరావు పలువురు పట్టణ ప్రముఖులు వైద్య శిబిరానికి సంబంధించిన పత్రికలను ఆవిష్కరించి అరుదైన వైద్య పరీక్షలు నిర్వహించే ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు, ఈ కార్యక్రమంలో పట్టణ పుర ప్రముఖులు దేవరకొండ నాగేశ్వరరావు, పావులూరి హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు వివరాలకు 6300995649, దత్త సాయి సన్నిధి చైతన్య టెక్నో స్కూల్ దగ్గర సుబ్బయ్యతోట చిలకలూరిపేట