

జనం న్యూస్ 27 జనవరి కోటబొమ్మాళి మండలం: ఫిబ్రవరి చివరి వారంలో పాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పరిధిల గల పాడి పశువుల మధ్య పాలపోటీలు నిర్వహించటం జరుగుతుందని అసక్తిగల పాడి రైతులు తనకు సంప్రదించాలని స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ లఖినేని కిరణ్‌కుమార్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీలకు మూడు జిల్లాలకు చెందిన పాడి రైతులు తమ పశువులను పట్టుకొని విజయనగరం జిల్లా తోటపాలేం గ్రామానికి చేరుకోవాలని, అక్కడ మూడు రోజులు ఉండాల్సి ఉంటుందని పశువులకు రవాణా, వసతి, దాణా, నీటి సౌకర్యంతోపాటు రవాణా సమయంలో భీమా సదుపాయం ఉచితంగా కల్పించబడుతుందని ఆయన తెలిపారు. సాహివాల్ ఆవు జాతి పశువులు పూటకు 6లీటర్లు, ఒంగోలు జాతీ 5లీటర్లు, రాధీ జాతీ పూటకు 6లీటర్లు, నాటు ఆవు 4లీటర్లు, జెర్సీ క్రాస్ అవు 10లీటర్లు, హెచ్.ఎఫ్.క్రాస్ జాతీ ఆవు 12లీటర్లు, దీంతో పాటు గేద పూటకు 8లీటర్లు పాలు కనీసం ఇవ్వాల్సి ఉంటుందని, వీటిలో ఎక్కువ పాలు ఇచ్చిన పశువులకు ప్రధమ బహుమతి కింద రూ. 50వేలు, ద్వితీయ బహుమతి రూ. 40వేలు, తృతీయబహుమతి రూ. 25వేలు పాడిరైతులకు అందజేయటం జరుగుతుందని ఆసక్తి గల పాడిరైతులు 768085477కు ఫోన్ చేసినా, నేరుగా ఆయనా సంప్రదించాలని డాక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు.