Listen to this article
  • సిర్పూర్ యు మండలం శేట్టి హడప్నూర్ నూతన అంగన్వాడీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం
  • మార్కెట్ కమిటీ చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ రావ్

జనం న్యూస్ జనవరి 27 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలంలోని శెట్టిహడప్నూర్ గ్రామంలో నూతన అంగన్వాడీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ రావ్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని అన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 13 నెలల నుంచి మాత్రమే ప్రజలు కొంతమేర సంతోషంగా ఉన్నారని, ప్రజా ప్రభుత్వం రాగానే 21 వేల కోట్ల రైతుల రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్,యువత కోసం ప్రభుత్వం ఖాళీల భర్తీ, నైపుణ్యత అందించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేశామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిర్పూర్ యు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆత్రం గోవింద్ రావ్ , స్థానిక అంగన్వాడీ టీచర్ ఆత్రం వనజ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మండాడీ లింగు , సెక్రటరీ పద్మారావు కారోబారి విశ్వనాథ్ , గ్రామ పటేల్ ఆత్రం శ్రీ రావ్ గారు,యూత్ కాంగ్రెస్ నాయకులు సుద్దాల ఆనంద్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.