Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 16:నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామంలోని గోదావరినది దగ్గర నిర్మించిన శ్రీ కృష్ణ దేవాలయం లో కృష్ణాష్టమివేడుకలు గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగానిర్వహించారు.ఆలయ పురోహితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, యజ్ఞం, భజన కార్యక్రమాలు, గీత గోవింద పారాయణం నిర్వహించారు.చుట్టూ ప్రక్క గ్రామాల వారుకూడ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు భక్తులకు అన్నదానముకూడా ఏర్పాటు చేశారు. పిల్లల కోసం శ్రీకృష్ణ వేషధారణ పోటీలు, గోపికల ఆటలు, యువత కోసం మట్టికొట్టు వంటి వినోదాత్మక – ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ భక్తికి, సత్సంగానికి, సమైక్యతకు సంకేతమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమములో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఏలేటి రాజారెడ్డి, గోపిడి గంగాధర్, దేశావోయినా సంజీవ్, దశరత్, ఎర్రాజీ ప్రవీణ్, ఏ. హరీష్, బి. రాజేశ్వర్, కె. జనార్దన్, పి. దాస్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.